Nov 12,2022 00:08

ఆందోళన చేపడుతున్న మహిళలు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మండలంలోని చిన్నల బుడు పంచాయతీ హట్టగూడ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు పై బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం కాంగ్రెస్‌ మహిళా మండల అధ్యక్షురాలు గొల్లూరి పద్మ, యువ నాయకులు మొస్య ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ, హట్టగూడ గ్రామంలో సుమారు 150 కుటుంబాలు 800 మంది గిరిజనలు ఉన్నారనీ, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి గ్రామంలో ఉందని చెప్పారు. గతంలో సుమారు రూ.5 లక్షలు ఖర్చు పెట్టి నామమాత్రంగా కుళాయి నిర్మాణం చేపట్టారని, కొద్ది రోజులకే మరమ్మతులకు గురై పని చేయక పోవడంతో గ్రామంలో తాగడానికి చుక్కనీరు లేని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లూరి కొండమ్మ, గొల్లూరి ఊర్మిళ, అరడ కాంతమ్మ, మజ్జి రామమూర్తి, బురిడీ దయామంత్‌, కిల్లో జగబంధు, పాంగి లైకోన్‌ పాల్గొన్నారు.