కాంతమ్మతో ముచ్చటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ
ప్రజాశక్తి - పొందూరు: ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్న పొందూరు పట్టణానికి చెందిన 76 ఏళ్ల వడుకు ఖాదీ కార్మికురాలు జల్లేపల్లి కాంతమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కాసేపు ముచ్చటించారు. వేడుకల సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక గ్యాలరీలో కూర్చున్న సమయంలో ఆమె వద్దకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి అధికారులు ఆమెను పరిచయం చేశారు. ఆమెను ప్రధాని ఆప్యాయంగా పలకరించి పొందూరు ఖాధీ ప్రత్యేకతపై ముచ్చటించారు. ఆమెతో పాటు ఖాదీ నేత కార్మికుడు బల్ల భద్రయ్యకు కూడా ప్రధానిని కలిసే అవకాశం లభించింది.










