క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ లో ఎస్వీయూకి ఉన్నత స్థానం
ప్రజాశక్తి - క్యాంపస్ : క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2024 సంవత్సరం లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ 451-500 ర్యాంక్‌ను, క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో దక్షిణా సియాలో 125 ర్యాంక్ ర్యాంక్ పొందిందని ఎస్వియూ ఉప కులపతి ఆచార్య కె. రాజారెడ్డి వెల్లడించారు. పనితీరు సూచికల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించారన్నారు. దక్షిణ ఏసియాలో 125 ర్యాంక్ సాధించడం పట్ల శ్రీ వేంకటేశ్వర యూని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.రాజా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించి న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, రీసెర్చ్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ తదితరు లందరినీ అభినందించిన వైస్ ఛాన్సలర్ రానున్న రోజుల్లో యూని వర్సిటీకి గుర్తింపు తెచ్చేందుకు కషి చేయాలని సూచించారు. ఈ ఘనత సాధించి నందుకు రిజిస్ట్రార్ హర్షం వ్యక్తం చేస్తూ అధ్యాప కులను అభినం దించారు.










