Sep 22,2023 21:43

స్విమ్స్‌లో విద్యార్థులకు ఇమ్యూనోథెరపీపై వర్కుషాపు

క్యాన్సర్‌ నివారణలో ఇమ్యునోథెరపీ కీలకం
ప్రజాశక్తి - తిరుపతి సిటి
రానున్న రోజుల్లో క్యాన్సర్‌ నివారణలో అమ్యునో థెరపీ కీలకపాత్ర పోషించనుందని డాక్టర్‌విజరుగోపాల్‌రెడ్డి అన్నారు. స్విమ్స్‌ పాథాలజీ విభాగం ఆధ్వర్యంలో పద్మావతి ఆడిటోరియంలో అతిథి ఉపన్యాసం విజయవంతంగా సాగింది. ఈ దిశగా ప్రపంచవ్యప్తంగా పరిశోధనలు విస్తృతస్థాయిలో జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ ఈ మూడు ప్రక్రియలు క్యాన్సర్‌ చికిత్సకు అందుబాటులో ఉన్నాయన్నారు. తాజాగా ఇమ్యునోథెరపీ అందుబాటులోకి రానుందన్నారు. క్యాన్సర్‌ సోకిన భాగంలో ఇంజనీర్డ్‌ ఇమ్యూన్‌ సెల్స్‌ పాత్రపై వర్కుషాపు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్విమ్స్‌ ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఉషా కళావత్‌, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రుక్మాంగద పాల్గొన్నారు.
స్విమ్స్‌లో విద్యార్థులకు ఇమ్యూనోథెరపీపై వర్కుషాపు