Aug 08,2023 20:56

ప్రజాశక్తి - తణుకురూరల్‌
ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాలలో నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో టెక్‌ మహీంద్ర క్యాంపస్‌ డ్రైవ్‌ మంగళవారం నిర్వహించారు. ఈ క్యాంపస్‌ డ్రైవ్‌లో 150 మంది విద్యార్థులు పాల్గొనగా మహిళా కళాశాల నుండి 45 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్‌ కరుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థినులకు 6 నెలల పాటు చెన్నరులో ట్రెయినంగ్‌ ఉంటుందని, తరువాత వారి వార్షికాదాయం రూ.2,40,000 అని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ లెఫ్టనెంట్‌ యుఎల్‌ సుందరీబారు, జి.హరిప్రసాద్‌ విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ ఎం.కిిషోర్‌రెడ్డి, యంగ్‌ ఫ్రొఫెషనల్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ బి.ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.