చలికాలంలో ఎక్కువగా వచ్చే కాయగూర క్యాలీఫ్లవర్. ఈ సీజన్‌లో రుచికరమైన ఆకఁపచ్చఁ కూరగాయలు నోరూరిస్తుంటాయి. అటువంటి వాటిల్లో క్యాలీఫ్లవర్ ఒకటి. ఇంకెందుకాలస్యం శరీరాఁకి కావలసిన ప్రొటీన్లను అందజేసే క్యాలీఫ్లవర్‌తో పిల్లలకఁ నచ్చే విధంగా వంటలు తయారుచేసుకోవచ్చు. మరి రుచికరమైన వంటలను ఎలా తయారుచేయాలో చూద్దామా..
చలికాలంలో ఎకఁ్కవగా వచ్చే కాయగూర క్యాలీఫ్లవర్. ఈ సీజన్‌లో రుచికరమైన ఆకఁపచ్చఁ కూరగాయలు నోరూరిస్తుంటాయి. అటువంటి వాటిల్లో క్యాలీఫ్లవర్ ఒకటి. ఇంకెందుకాలస్యం శరీరాఁకి కావలసిన ప్రొటీన్లను అందజేసే క్యాలీఫ్లవర్‌తో పిల్లలకఁ నచ్చే విధంగా వంటలు తయారుచేసుకోవచ్చు. మరి రుచికరమైన వంటలను ఎలా తయారుచేయాలో చూద్దామా..
గోబీ 65
కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్- 2 (పెద్దవి), పెరుగు- 2 కప్పులు, ఉప్పు- తగినంత, పసుపు- చిన్న స్పూన్, కారం- 3 స్పూన్స్, తందూరి రంగు- చిటికెడు, అల్లంవెల్లుల్లి పేస్ట్- 2 స్పూన్స్, గరంమసాలా- స్పూన్, ఆవాలు- 2 స్పూన్స్, జీలకర్ర- 2 స్పూన్స్, కరివేపాకఁ- కొంచెం, నూనె- వేయించడాఁకి సరిపడా.
తయారుచేసే విధానం:
- క్యాలీఫ్లవర్ పువ్వుల్ని శుభ్రం చేసుకఁఁ, మరుగుతున్న నీటిలో ఁమిషం పాటు ఉంచి, కాసింత ఉప్పు కలిపి దించేయాలి.
- తర్వాత పువ్వుల్లో
పురుగులున్నాయేమో చూసుకొఁ జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. చిన్న చిన్నవిగా క్యాలీఫ్లవర్‌ను కట్ చేసుకఁఁ పక్కన పెట్టుకోవాలి.
- పెరుగులో కారం, ఉప్పు, పసుపు పొడులను వేయాలి. అందులోనే తందూరి రంగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమంలోనే క్యాలీఫ్లవర్‌ను వేసి, పది ఁమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- తర్వాత పాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తరువాత క్యాలీఫ్లవర్‌ను వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి.
- మరో పాన్‌ఁ తీసుకఁఁ, కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకఁ వేయాలి. అవి చిటపటలాడాక వేయించిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి, బాగా వేయించి దించేయాలి.
- అంతే గోబీ 65 తయారు. దీఁ్న పిల్లలకఁ పెడితే ఎంతో ఇష్టంగా స్నాక్స్‌లా తినేస్తారు.
పరాఠ
కావాల్సిన పదార్థాలు : గోధుమపిండి - 400గ్రా., క్యాలీఫ్లవర్ - 200 గ్రా., కరివేపాకఁ - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 2, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు, కారం, గరంమసాలా - రుచికి తగినంత, వాము (ఇష్టమైతే) - అర టీస్పూను, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం :
- ముందుగా గోధుమపిండిఁ నీటితో తడిపి ముద్దలా చేసి, పక్కన ఉంచుకోవాలి.
- సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్, కరివేపాకఁ, పచ్చిమిర్చి, అల్లంతో పాటు కారం, గరంమసాలా, వాము, ఉప్పుఁ ఒక పాత్రలో వేసి కలుపుకోవాలి.
- పిండిఁ సమభాగాలుగా చేసి, ఒక పరాఠాకి రెండేసి చపాతీల్లా చేసుకోవాలి.
- ఒక చపాతీ పైన క్యాలీఫ్లవర్ మిశ్రమాఁ్న పరిచి, పైన మరో చపాతీ ఉంచి, రొట్టెల కర్రతో రుద్దాలి. (రెండూ అతుకఁ్కపోయి కాస్త పెద్ద చపాతీ అవుతుంది).
- తర్వాత పెనంపైన నూనె వేసి, రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. వీటిఁ దోసకాయ, పెరుగు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
బ్రెడ్..
కావాల్సిన పదార్థాలు: గుడ్డు సొన-6, క్యాలీఫ్లవర్-1, బాదం- 2 కప్పులు (తురిమినది), వెన్న- కప్పు, వెల్లుల్లి పేస్ట్- 2 స్పూన్స్, ఉప్పు- సరిపడా, పసుపు- సరిపడా, మైదా- 2 స్పూన్స్, ఎండు మిరపకాయ ముక్కలు- తగినంత, బేకింగ్ పౌడర్- స్పూన్, తురిమిన కొత్తిమీర - ముప్పావు స్పూన్, చీజ్ క్యూబ్స్- అరకప్పు (తురిమినవి).
తయారుచేసే విధానం:
- ఒక బౌల్ తీసుకొఁ అందులో గుడ్డుసొన, క్యాలీఫ్లవర్‌ను
వేసి, ఁమిషం పాటు బేక్ చేయాలి.
- తర్వాత వెన్న, బాదం, వెల్లుల్లి వెయ్యాలి.
- అందులోనే మిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, బేకింగ్ పౌడర్, కొత్తిమీర, చీజ్‌లను వేయాలి.
- తర్వాత వాటఁ్నంటినీ బాగా కలిపి, రెండు ఁమిషాల పాటు బ్లెండ్ చేయాలి.
- ముందుగా ఓవెన్‌ఁ కనీసం పదిహేను ఁమిషాలపాటు ప్రీ హీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు బ్రెడ్ ప్లేట్‌లో బటర్ పేపర్ పెట్టి, బ్రెడ్ పిండిఁ అందులో వేసి బేక్ చేయాలి. అంతే గోబీ బ్రెడ్ రెడీ!
రైస్
కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్- అరపువ్వు, బాసుమతి అన్నం- 2 కప్పులు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- 2, జీలకర్ర - అరస్పూన్, పసుపు- పావుస్పూన్, కారం- అరస్పూన్, దాల్చిన చెక్క- కొద్దిగా, లవంగాలు- నాలుగు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- తగినంత, కొత్తిమీర- కొద్దిగా.
- తయారుచేసే విధానం:
- ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న పూవులుగా విడదీసుకోవాలి. తరువాత వాటిఁ మరుగుతున్న నీళ్లల్లో వేసి, కాసేపు ఉంచాలి.
- ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకఁఁ ఉంచుకోవాలి.
- తర్వాత ఒక పాన్‌ను తీసుకఁఁ, దాఁ్న స్టవ్‌పై ఉంచి నూనె పోసి వేడిచేయాలి. అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి.
- జీలకర్ర చిటపటలాడిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి, బంగారు వర్ణంలోకి వచ్చే వరకూ వేయించాలి.
- అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసి, కాస్త వేయించాలి. పోపు వేగిన తరువాత కారం, పసుపు, కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి.
- తర్వాత అందులోనే క్యాలీఫ్లవర్ వేసి, మొత్తం మిశ్రమాఁ్న బాగా కలిపి సన్నఁ మంటపై పది ఁముషాలు వేయించాలి.
- ఇలా బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. గోబీ మెత్తగా మారిన తరువాత అందులో ముందుగా వండి పెట్టుకఁన్న అన్నం వేసి మొత్తం మిశ్రమాఁ్న బాగా కలుపుకోవాలి.
- అలా ఐదు ఁముషాలు తకఁ్కవ మంటపై వేయించాలి. చివరగా కొత్తిమీర వేసి, బాగా కలిపి దింపేయాలి. అంతే గోబీ రైస్ రెడీ!