క్యాబినేట్ నిర్ణయం కాంట్రాక్టు ఉద్యోగులకు తీరని అన్యాయం
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిరసన
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయం చాలా మంది కాంట్రాక్టు ఉద్యోగులకు తీరని అన్యాయం చేసేలా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ స్టేట్ ఈసీ మెంబర్ గిరి శంకర్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కాంట్రాక్టు నర్సులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు త్రీవ అన్యాయం జరిగిందన్నారు.2-6-2014 కు ముందు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అపాయింట్ అయిన వారికి రెగ్యులర్ చేస్తామని చెప్పడం చూస్తే కేవలం నామమాత్రంగా రెగ్యులర్ చేసి చేతులు దులుపుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరిని రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో 2011 సంవత్సరం తర్వాత ఎటువంటి రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు చెప్పిన విధంగా చేస్తే ఒక కర్నూల్ డిస్టిక్ నందు ఉన్న వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్ కింద ఉన్న 70 మంది పైగా మాత్రమే ఉద్యోగులు రెగ్యులర్ కావడానికి ఆస్కారం ఉంది. కానీ వైద్యశాఖలో 2015 వ సంవత్సరము 2016వ సంవత్సరముల నుండి మాత్రమే చాలామంది కాంట్రాక్టు ఉద్యోగులు డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే2.6.2014 కు ముందు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు 4161 మంది ఉన్నారు. 2014 సంవత్సరం తర్వాత 2.6.2022 వరకు 9017 మంది ఉద్యోగస్తులు ఉన్నారని మొత్తంగా 6000 మంది పైగా ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుందన్నారు.కావున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరములు పైబడిన ప్రతి ఒక్క కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల , నంద్యాల గవర్నమెంట్ హాస్పటల్ నర్సింగ్ సిబ్బంది శైలజ, మల్లికా, సంపత్ త్రివేణి విజయలక్ష్మి సుబ్బమ్మ ఉషారాణి,ప్రశాంతి, రాజశేఖర్ తదితరులు పాల్గున్నారు.










