Nov 13,2022 00:26

కవితా సంపుటాలను ఆవిష్కరిస్తున్న రచయితలు

ప్రజాశక్తి-సీతమ్మధార : ప్రముఖకవి రొక్కం కామేశ్వరరావు మూడుభాషలలో రచించిన మూడు కవితా సంపుటాలను ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఎల్‌ఆర్‌.స్వామి శనివారం పౌరగ్రంథాలయంలో ఆవిష్కరించారు. విశాఖ సాహితీ మిత్ర ఆధ్వర్యాన ప్రముఖ రచయిత డాక్టర్‌ డివి.సూర్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తమిళంలో అనువదింపబడిన అంతర్ముగం పుస్తకాన్ని ఎల్‌ఆర్‌ స్వామి సమీక్షచేశారు. ఇన్నర్‌ విజన్‌ ఆంగ్లానువాదపుస్తకాన్ని డాక్టర్‌ వి.రాధాదేవి, ముఖారి తెలుగు కవితను ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ సమీక్షించారు. రొక్కం కామేశ్వరరావు ఆయన అనుభవాలనూ, కవిత్వచైతన్యతత్వాన్నీ సునిశితంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు పాల్గొన్నారు.