Aug 03,2023 21:45

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ :  క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 9న జిల్లా కేంద్రంలో జరుగు ధర్నాలు జయప్రదం చేయలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు నాయకులు పిలుప ునిచ్చారు. గురువారం ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు అధ్యక్షతన సుందరయ్య భవనంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ ఈనెల 9న క్విట్‌ ఇండియా ఉద్యమస్ఫూర్తితో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక రైతాంగం విద్యార్థి, యువజన, మహిళలు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 9న జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా ఉంటుందని, దీన్ని వివిధ ట్రేడ్‌ యూనియన్‌, ప్రజా సంఘాలు జయప్రదం చేయాలని కోరారు. 9ఏళ్ల మోడీ పరిపాలనలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదని, స్కీం వర్కర్ల శ్రమను దోచుకుం టూ వారిని పర్మినెంట్‌ చేయడం లేదని విమర్శిం చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 900 రోజులుగా పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకే కట్టుబడి ఉంటానని చెబుతోందన్నారు. అసంఘటిత కార్మికులందరికీ పిఎఫ్‌, ఇఎస్‌ఐ, పెన్షన్‌ ఆరోగ్య సౌకర్యాలు, సామాజిక భద్రత పథకాన్ని ఇంతవరకు ప్రకటించలేదని, కాంట్రాక్ట్‌ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న చట్టం చేయలేదని, కొత్త పెన్షన్‌ స్కీమ్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీం పునరుద్ధరిం చాలని, కనీసం ఇపిఎస్‌ పెన్షన్‌ రూ.9000 కు పెంచాలన్న కోరికతీర్చడం లేదని అన్నారు. మణిపూర్లో రెండు జాతుల మధ్య గొడవ పెట్టి గిరిజన మహిళ ఊరేగించడం అత్యంత దారుణ మైన చర్య ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈనెల 9న బైక్‌ ర్యాలీ, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలు, కార్మికులు, రైతులు పాల్గొనాలని జయప్రదం చేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు మాట్లాడిన వివిధ ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, విఆర్‌ఎల సంఘ నాయకులు ఈశ్వరరావు, పాపారావు, సిఐటియు పట్టణ నాయకులు బి.సూరిబాబు, ఎస్‌.ఉమా, మున్సిపల్‌ కార్మికుల ఫెడరేషన్‌ నాయకులు ఎన్‌వై నాయుడు, శ్రామిక మహిళ నాయకులు వి.ఇందిర, శ్రీరామ్మూర్తి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.