తెనాలి: పట్టణానికి చెందిన కవి ఆళ్ల నాగేశ్వర రావు స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారానికి ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సం దర్భంగా విశాఖపట్నంకు చెందిన అర్పిత సాహిత్య సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారాలలో భాగంగా సాహితీ రం గానికి సంబంధించి నాగేశ్వరరావును ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు జి.విజరుకుమార్ పంపిన ఎంపిక పత్రాన్ని వాట్సప్ ద్వారా అందుకున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 28న హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే సభలో ఆళ్ల ఈ పుర స్కారాన్ని అందుకోనున్నారు.










