- ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: కవాతుతోనే పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, ఐకమత్యభావం కలుగుతుందని ఎస్‌పి జి.ఆర్ రాధిక అన్నారు. ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు మైదానంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు పరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం నాడు మరింత ఉత్సాహంగా పరేడ్ ప్రదర్శన చేయాలన్నారు. పోలీసు శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆర్మ్‌డ్, సివిల్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సమస్యలపై గ్రీవెన్స్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు వై.శృతి, ఎస్.బాలరాజు, జి.వి ప్రసాదరావు, డి.విజయకుమార్, ఎస్.వాసుదేవ్, డి.ప్రసాదరావు, ఆర్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










