ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో కుటుంబ వైద్య విధానం పై ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ లో పాల్గొన్న కలెక్టరు కుటుంబ వైద్యుడు విధానంపై తీసుకున్న చర్యల గురించి వివరించారు. విజయవాడ సి ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. వైద్య, శ్రీ శిశు సంక్షేమంలోని పథకాలు, ఎస్ టి జి ఇండికేటర్, విద్య, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కుటుంబ వైద్యుడు విధానం చేపడుతున్నామన్నారు. జిల్లాలో రక్తం తక్కువ ఉన్న గర్భిణులను డాక్టర్లు పరీక్షిస్తున్నారన్నారు. ఇప్పటివరకు 50 శాతం పరీక్షించడం జరిగిందని ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం క్రింద గ్రీవెన్స్ ను త్వరగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టరు క్రిష్ణారెడ్డి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఎమ్‌టి. నాయక్, ఐసిడిఎస్ పీడీ లక్ష్మి కుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










