ప్రజాశక్తి-కర్లపాలెం: రాబోయే ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, నన్ను మీ కుటుంబ సభ్యుడిలా భావించి ఆదరించాలని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. శుక్రవారం ఇంటింటికీ తెలుగుదేశం, మీ మాట - నా బాట కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం మండలంలోని పేరలి గ్రామంలోని తూర్పు యాదవపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకుల తో కలిసి ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ విధానాలను వివరించారు. మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గ ప్రజలకు అండగా మా వేగేశన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ చేరువయిన విషయం అందరికీ తెలుసని అన్నారు. అవినీతి, లంచాలకు తావులేని వ్యవస్థలను నిర్మించి కలిసికట్టుగా మన బాపట్లను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెరలి గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి అండగా నిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏపూరి భూపతిరావు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నక్కల వెంకటస్వామి, మాజీ సర్పంచి బొద్దుకూరి విజయ, మాజీ ఎంపీటీసీ కట్టా సుజాత, మండల ఎస్సీ సెల్ నాయకుడు దాస్, టిడిపి నాయకులు మద్దిబోయిన బుల్లయ్య, ముసలయ్య మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










