Jan 08,2023 23:23

అందజేసిన కుట్టుమిషన్లు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: స్థానిక శారద నగర్‌ లో రోటరీ క్లబ్‌ భవనంలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సైకిళ్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ, ఇప్పటికే రక్తదాన శిబిరాలు, పల్స్‌ పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వికలాంగులకు 5 వీల్‌ చైర్లు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధినులకు 28 సైకిళ్ళు, మహిళలకు 26 కుట్టుమిషన్లు అందజేశామన్నారు. రోటరీ క్లబ్‌కు బిల్డింగ్‌ను విరాళంగా అందజేసిన దంగేటి లక్ష్మణ్‌మూర్తి కుమారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రెసిడెంట్‌ సుతాపల్లి అప్పలరాజు, సెక్రటరీ జంపన నాగేంద్ర రాజు, ట్రెజరర్‌ గ్రంథి ఫణి, పాస్ట్‌ అసిస్టెంట్‌ గవర్నర్‌ సుతాపల్లి శ్రీకాంత్‌, అసిస్టెంట్‌ గవర్నర్‌ నారాయణరావు, సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 26న వాసవి కళ్యాణ మండపం వద్ద స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు బ్లడ్‌ క్యాంప్‌ చైర్మన్‌ జాలుమూరి రాజ్‌ కుమార్‌ తెలిపారు.