Nov 04,2023 01:01

ప్రజాశక్తి - పర్చూరు
రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు మరియు తానా ఫౌండేషన్ (యు.యస్‌.ఏ) సంయుక్తంగా నిర్వహించిన కార్య క్రమం లో స్థానిక భవనం వీరారెడ్డి రోటరీ భవనం నందు పెదనందిపాడు రోటరీ క్లబ్ కు ఆరు కుట్టు మిషన్లు అందచేశారు. తానా కోశాధికారి కొల్లా అశోక్ బాబు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా కొల్లా అశోక్ బాబు మాట్లాడుతూ రోటరీ క్లబ్ తో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించటం సంతోషంగా గా ఉందని భవిష్యత్తులో మరిన్ని కార్య క్రమాలు కు తానా తరుపున చేయూత అందిస్తామని తెలియ చేశారు. పెదనందిపాడు క్లబ్ అద్య క్ష , కార్యదర్శులు  వై .కోదండ రామిరెడ్డి, వై . రమణ, పూర్వపు  అధ్యక్షుడు పోపూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తానా వారికి ధన్య వాదములు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్య దర్సులు నాగభై రు శ్రీనివాసరావు, పంబి సదానంద రెడ్డి, సభ్యులు కోట హరిబాబు, గడ్డిపాటి శ్రీనివాసరావు, కోట శ్రీనివాసరావు, దూళిపల్లి సత్యం, దండా శ్రీనివాస్ రావు, పోలిశెట్టి చంద్రం, పాబోలు  వెంకన్న, కోడూరు సుబ్రహ్మణ్య చారి, కోమటి ఆంజనేయులు, కారుమూడి సుబ్బారెడ్డి, రావి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.