Sep 13,2023 20:50

దీక్షా శిబిరంలో టిడిపి నాయకులు

దీక్షా శిబిరంలో టిడిపి నాయకులు
కుట్రపూరితమే చంద్రబాబు అరెస్ట్‌
ప్రజాశక్తి-కోవూరు:ఓపథకం ప్రకారం మాజీ సిఎం చంద్రబాబు నాయుడును అధికార పార్టీ కుట్రతోనే అరెస్ట్‌ చేయడంపై రాష్ట్ర ప్రజల్లో టిడిపిపై సానుభూతి పెరిగిందని కోవూరు టిడిపి ఇన్‌ఛార్జి పోలం రెడ్డి దినేష్‌ రెడ్డి అన్నారు.బుధవారం కోవూరులో రిలే నిరాహార దీక్ష లో భాగంగా జరిగిన ప్రెస్‌ మీట్లో మాట్లాడారు. చంద్రబాబు శాంతి యుతంగా అందరూ ఉండాలని ప్రతి సారి తెదేపా కార్యకర్తలుకు పిలుపు ఇచ్చే వారని అన్నారు.
కుట్రలు, కుతంత్రాలు టిడిపికి చేతకాదన్నారు. నిరంకుశ పాలనలో ప్రతి పక్ష టిడిపిని పూర్తిగా అణచి వేయాలను అంచెలంచెలుగా బాబు పై అక్రమ కేసులు పెట్టించడంలో జగన్‌ పాత్ర ఉందన్నారు. బాబును విడుదల చేసి వరకు పోరాటం చేస్తామన్నారు.కార్యక్రమంలో నాయకులు తిరుమురు అశోక్‌ రెడ్డి, ఇంతా మల్లా రెడ్డి, ఎంపీటీసీ యద్దలపుడి నాగరాజు, మాజీ సర్పంచ్‌ అంగిరేకుల కష్ణ ప్రసాద్‌, జహంగీర్‌, షేక్‌ వహీద్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.