Sep 21,2023 00:08

ప్రజాశక్తి - మార్టూరు రూరల్
రాజకీయ కుట్రతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు ఉప్పుటూరి రమాదేవి అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షల్లో ఆమె మాట్లాడారు. స్కిల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్  ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేయడం దుర్మార్గమని  అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇప్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేనప్పటికీ రాజకీయ కుట్రలో భాగంగానే రిమాండుకు పంపించారని ఆరోపించారు. వైసిపి చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో మందలపు ఆదిలక్ష్మి, అనుమోలు కస్తూరి, కోకా ఉమా, గంగాధర రత్నకుమారి, షేక్ ముంతాజ్ బేగం పాల్గొన్నారు.