Nov 15,2023 23:52
1ఫోటో రైట్‌ అప్‌ : సదస్సులో మాట్లాడుతున్న డిప్యూటీ పారా లీగల్‌ ఆఫీసర్‌ సారంగపాణి

ప్రజాశక్తి - రేపల్లె: పట్టణంలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో కుష్టి వ్యాధిపై విద్యార్థులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. డిప్యూటీ పారా లీగల్‌ ఆఫీసర్‌ సారంగపాణి మాట్లాడుతూ పోలియో, మశూచి రహిత దేశంగా చేయగలిగామని అన్నారు. కుష్టి వ్యాధి రహిత దేశంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణంగా చర్మం రంగు కంటే కొంత తక్కువ రంగు లేదా రాగి రంగు ఉన్న స్పర్శ లేని మచ్చలు, నూనె పూసినట్టుగా నిగనిగలడే స్పర్శ లేని చర్మం ఉన్నట్లయితే ప్రాథమికంగా కుష్టి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చని తెలిపారు. కుష్టి వ్యాధికి సంబంధించి ఎలాంటి మూఢనమ్మకాలు, అపోహాలు విశ్వసించవద్దని అన్నారు. కుష్టి వ్యాధి పట్ల సమాజంలో అవగాహన పెంచడానికి సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్ఠు రోగులను ప్రేమతో ఆప్యాయంగా చూడాలని అన్నారు. వారి పట్ల వివక్ష చూపరాదని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఈవిఆర్‌ గిరి కుమారి పాల్గొన్నారు.