Sep 11,2023 19:01

కుష్టు రోగులకు ఎంసిఆర్‌ చెప్పులు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :కుష్టు వ్యాధి విషయంలో అవగాహన కలిగి ఉండాలని లెప్రసీ, ఎయిడ్స్‌, టిబి కంట్రోల్‌, జిల్లా అధికారి డాక్టర్‌ ఎస్‌.కె ఖా దర్‌ వల్లి సూచించారు. సోమ వారం అయన మండలంలోని మండలం వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. డాక్టర్‌ ఖాదర్‌ వల్లి మాట్లాడుతూ కుష్టు, ఎయిడ్స్‌, టీబి (క్షయ) వ్యాధుల విషయంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. రానున్న సీజన్‌లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంటుందని, దాం తో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో పర్యటించి డెంగీ, మ లేరియా, చికెన్‌ గున్య, టైఫా యిడ్‌ జ్వరాలపై ప్రజలకు అవ గాహన కల్పించాలని అయన సూచించారు. సూపర్‌ వైజర్లు, ఎఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్స్‌, ఎంఎల్హెచ్పిఎస్‌, ఆశా వర్కర్లు ఉన్నారు.