ప్రజాశక్తి -సీలేరు
కుష్టి వ్యాధిని నిర్మూలిద్దామంటూ జికె.వీధి మండలం దారకొండ గ్రామ సర్పంచి నడిగట్ల రాజు, పిహెచ్‌సి వైద్యాధికారిణి హిమబిందు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ మంగళవారం చేశారు. దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టి వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వంచారు. జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు, వైద్యాధికారి హిమబిందు మాట్లాడుతూ దేశాన్ని పోలియో, మశూచి రహిత దేశంగా చేయగలిగామని, కుష్టి వ్యాధి రహిత దేశంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణంగా చర్మం రంగు కంటే కొంత తక్కువ రంగు లేదా రాగి రంగు ఉన్న స్పర్శ లేని మచ్చలు, నూనె పూసినట్టుగా నిగనిగలడే స్పర్శ లేని చర్మం ఉన్నట్లయితే ప్రాథమికంగా కుష్టి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చునని తెలిపారు. కుష్టి వ్యాధికి సంబంధించి ఎలాంటి మూఢనమ్మకాలు అపోహాలు విశ్వసించవద్దని కుష్టి వ్యాధి పట్ల సమాజంలో అవగాహన పెంచడానికి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఓ పోతురాజు, పిహెచ్‌ఎన్ రాణి, హెల్త్ అసిస్టెంట్ గోవిందు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
కుష్టు వ్యాధిపై అవగాహన
హుకుంపేట : మండలంలోని కుష్టు వ్యాధి పై కొంతిలి గ్రామంలో మంగళవారం అవగాహన కల్పించారు. అనంతరం వైద్యాధికారి సుమన్న మాట్లాడుతూ, కుష్టు వ్యాధి లక్షణాలు బయట పడేందుకు రెండు నుండి ఐదు సంవత్సరాల వరకు పట్టవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి గాయత్రి, స్వప్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
a










