Nov 24,2022 23:24

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సాంబమూర్తి

ప్రజాశక్తి -ఆనందపురం: చర్మంపై స్పర్శ లేని, రాగి రంగు కలిగిన మచ్చలు ఉంటే అవి కుష్టువ్యాధి లక్షణాలు కావచ్చని, వెంటన సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాధినిర్థారణ పరీక్షలు చేయించుకుని ప్రభుత్వపరంగా ఉచితంగా ఇచ్చే మందులు వాడడం ద్వారా నివారించవచ్చని సామాజిక ఆరోగ్య అధికారి పి. సాంబమూర్తి సూచించారు. గురువారం నేలతేరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు కుష్టువ్యాధిపై అవగాహన కల్పించారు.
చర్మంపై స్పర్శ లేకపోవడం, రాగి రంగు మచ్చలు, చర్మం పొడిగా ఉండడం, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, అరచేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోవడం, కాళ్లకు వేసుకున్న చెప్పులు జారిపోవడం, చల్లని లేదా వేడి వస్తువులతో స్పర్శ లేకపోవడం వంటివి కుష్టువ్యాధి అనుమానిత లక్షణాలని,వీటిని అలక్ష్యం చేయరాదన్నారు..కార్యక్రమంలో డిపిఎంఒ బి. భీమేశ్వరరావు, కస్తూర్బా పాఠశాల ఎస్‌ఒ ఎం.చంద్రకళ, హెచ్‌ఎస్‌ ఎన్‌వి .రమణ, ఆరోగ్య కార్యకర్తలు ఎం.సత్యవతి, దేవి. ఆశా కార్యకర్త ఉమా పాల్గొన్నారు