Jul 02,2023 00:03

మాట్లాడుతున్న డిఎల్‌ఒ విశ్వేవ్వరనాయుడు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అల్లూరి జిల్లా డీఎల్‌ఓ విశ్వేశ్వర నాయుడు కోరారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో శనివారం డుంబ్రిగుడ, కిల్లోగూడ పిహెచ్‌సిలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, కనుబొమ్మలోని కను వెంట్రుకలు రాలి పోవడం, అరచేతులు, అరికాళ్ళలో స్పర్శ లేకపోవడంతో పాటు చేతి, కాలు వేళ్ళు వంకర్లు తిరిగి ఉన్నట్లయితే కుష్టు వ్యాధి లక్షణాలని చెప్పారు. వీటిపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజల్లో అవగాహన పరిచి నిర్మూలనకు ప్రత్యేక కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సిల వైద్యాధికారులు కే కరుణ, ప్రేమ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి:స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో శనివారం ర్యాలీలో నిర్వహించారు డీఎల్‌ఓ విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ, వైద్య సిబ్బంది గ్రామస్థాయిలో సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి సర్వేలు నిర్వహించి వ్యాధి లక్షణాలు గుర్తించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించి వ్యాధి అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కోప్‌ సంస్థ ప్రతినిధి. శివకృష్ణ, స్థానిక వైద్యాధిధికారి ప్రతాప్‌, లొంగపర్తి పిహెచ్‌సి వైద్యాధికారి భార్గవి పాల్గొన్నారు