
కుర్చీలను ప్రారంభిస్తున్న జడ్జి వాణి
శృంగవరపుకోట: శృంగవరపుకోట బార్ అసోసియేషన్ పూర్వ సభ్యులు సింగంపల్లి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ప్రవీణ్ రూ.10 వేలు విలువైన కుర్చీలను బార్ అసోసియేషన్‌కు అందజేశారు. బుధవారం వాటిని న్యాయమూర్తి సబ్బవరపు వాణి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎపిపి పప్పు కేశవరావు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి అల్లు సత్యాజీ, డబ్ల్యుఎన్ శర్మ, సీనియర్ న్యాయవాదులు జి.సూరిదేముడు, ఎం.దుర్గాప్రసాద్, గేదెల ప్రకాష్, ఎన్‌టివి దాసు, బి.త్రిమూర్తులు, టివిఆర్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.