ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ అమత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 502 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేసింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల సిద్ధం ఆదివారం ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్, తదితరులు హాజరవ్వగా వీరితో పాటు నాయకులు తప్ప మిగిలిన కాకినాడ ప్రజలు ఎవరూ హాజరవలేదు.










