Jun 01,2023 00:28

కుర్చీలు అందజేస్తున్న దాతలు

ప్రజాశక్తి- అద్దంకి : పాలపర్తి జ్యోతిష్మతి, గాడేపల్లి దివాకర దత్తు పుట్టిన రోజు సందర్భంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో స్థానిక శాఖా గ్రంథాలయానికి బుధవారం 25 కుర్చీలు బహూకరించారు. ఈ కార్యమ్రంలో రోటరీ ప్రెసిడెంట్‌ సందిరెడ్డి శ్రీనివాసరావు, గ్రంథ పాలకుడు సిహెచ్‌. సుగుణరావు, రోటరీ సభ్యులు తమ్మన శ్రీనివాసరావు, గాడేపల్లి దివాకర దత్తు, షేక్‌ మొహమ్మద్‌ రఫీ, అద్దంకి లేవి ప్రసాద్‌, మలాది శ్రీనివాసరావు, ఊటుకూరు రామకోటేశ్వరావు, చుండూరి మురళీ సుధాకరరావు, చప్పిడి వీరయ్య, జాగర్లమూడి శివకుమారి, నర్రా శ్రీలక్ష్మి, కొల్లా భువనేశ్వరి పాల్గొన్నారు.