చూస్తుండగానే కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో వినియోగదారులు విలవిలాడుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, దిగుమతి లేకపోవడానికి తోడు వర్షాలు లేకపోవడంతో కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. రోజు రోజుకు ధరలు ఎగబాకడంతో ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది. 20 రోజుల కిందట రూ.150కు వచ్చిన సరుకులు ఇప్పుడు రూ.500 పట్టుకెళ్లినా రావడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలోని మార్కెట్లలో ఆకాశానంటిన ధరలు చూపి ప్రజలు బేజారెత్తిపోతున్నారు.
రాయచోటి టౌన్ : మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కొనలేక పచ్చడి మెతుకులే గతయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో టమాటా రూ.120 నుంచి 150 వరకు పలుకుతుంది. కిలో బీన్స్ రూ.120 కాగా, పచ్చి మిర్చి రూ.100 ఉండగా కాకరకాయ, బీరకాయ, బీట్రూట్, వంకాయల ధరలు రూ.50 పైబడి ఉన్నాయి. కూరగాయల ధరలు పెరగడానికి గత నెలలో ఎండలు విపరీతంగా పెరిగిపోవడం అలాగే బయట రాష్ట్రాలలో కురుస్తున్న వానలే కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. వానలతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్పత్తి తగ్గిపోయి ధరల పెరుగుదలకు కారణమై నట్లుగా తెలుస్తుంది. కూరగాయల ధరలు కొండెక్కడంతో ప్రజలు కొనల ేకపోతు న్నారు. వ్యవసాయ బోర్ల ద్వారా సాగుచేసే తోట లకు నీటి తిప్పలు పట్టుకుంది. సాగుచేసిన కూర గాయల దిగుబడి తగ్గిపోయి ప్రభావం వాటి ధర లపై పడ్డాయని రైతులు చెబుతున్నారు. ఇప్పు డిప్పుడే తొలి వర్షాలు పడుతున్నాయని పంట వేసిన రెండు నెలల తర్వాత పంట చేతికి వస్తా యని తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉందని పలు వురు వ్యాపారులు పేర్కొం టున్నారు.
దిగుబడి తగ్గి.. ధరలు పెరిగి..
గత నెలలో ఎండలు విపరీతంగా ఉండడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి సాగు చేసిన కూరగాయల పంటలకు నీరు అందక పోవడంతో ఆ ప్రభావం దిగు బడిపై పడింది. కూరగాయల ధరలు నిలకడగా ఉంటా యని భావించిన రైతులు చాలా మంది అనేక గ్రామాల్లో కూరగాయల సాగుకు ముందు కొచ్చారు. వ్యవసాయ బోర్లలో అరకొరగా వస్తున్న నీటితో కూరగాయలను సాగు చేస్తూ వచ్చారు. వర్షాభావ పరిస్థితులతో బోర్లలో నీరు అడుగంటిపోయి సాగు తగ్గిపోయింది. దీంతో కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి.










