
ప్రజశక్తి - చీరాల
చీరాల నుండి వేటపాలెం వరకు ఉన్న కుందేరు బ్రిడ్జిల పనులను ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి పర్యవేక్షించారు. కుందెరులో పూడిక తీత, జమ్మూ, గురపు డెక్క తొలగింపు పనులు, అభివృధి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తాగు నీరు, విద్యుత్ సమస్యలు ఆయన దృష్టికి పలువురు తీసుకువచ్చారు. ఆయన వెంట మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, జెసిఎస్ ఇంచార్జీ లేళ్ల శ్రీధర్, మాజీ సర్పంచులు చుండురి వాసు, కట్టా గంగయ్య, దంతం మంతు, డ్రైనేజీ డిఇ దివి సుబ్బారావు, పంచాయితీ రాజ్ డిఇ శేషయ్య, మునిసిపల్ డిఇ ఐసయ్య, డ్రైనేజీ ఎఇఇ జెవై కోటేశ్వరరావు పాల్గొన్నారు.