తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి దళితవాడలో పారిశుద్ధ్యం మెరుగుపరచ డంలో అధికారులు విఫలమయ్యారు. రోజు ల తరబడి డ్రైనేజీ కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి, మురుగునీరు పోయే దారి లేక డ్రైనేజీ కాలువ దుర్గంధం వెదజలు ్లతోంది. కాలువ పూడిక తీసారే కాని, చెత్త కుప్పలను తీయకుండా నిర్లక్ష్యం చేశారు. కుంచనపల్లి దళితవాడ ప్రధాన రహదారి వద్ద చెత్తకుప్పల దుర్గంధం వెద జల్లుతూ, పురుగులు ఇంట్లోకి వస్తున్నాయి. మన వైపు దోమల బెడదతో బెంబేలెత్తు తున్న పట్టించుకునే నాధుడే లేడంటూ పలువురు స్థానికులు వాపోతున్నారు. గురువారం సిపిఎం నాయకులు ప్రచార భేరి కార్యక్రమం దళితవాడలో నిర్వహిస్తుం డగా, 'మా దళిత వాడలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడం లేదు' అంటూ సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి వద్ద స్థాని కులు వాపోయారు. ఈ సందర్భంగా వెం కటరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు పారి శుద్ధ్యం మెరుగుపరచడంలో నిర్లక్ష్యం వహించరాదని, ప్రజల ఆరోగ్యాన్ని కాb ాడాలన్నారు. రోజుల తరబడి డ్రైనేజీ కాలువలు శుభ్రం పూడిక తీయకపోతే దోమలు ప్రబలి ప్రజలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాలవలను పూడిక తీయించి చెత్త కుప్పలను ఎత్తి, శుభ్రం చేయాలన్నారు. తక్ష ణమే సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి, కుంచనపల్లి దళితవాడలో పారి శుద్ధ్యం మెరుగు పరచాలని, డ్రైనేజీ కాలు వలు శుభ్రం చేయాలని, అధికారులను ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం తాడేపల్లి మండల నాయకులు పల్లె కృష్ణ, అమ్మిశెట్టి రామారావు పాల్గొన్నారు.










