Aug 30,2023 17:22

ప్రయాణికుల అవస్థలు
ప్రజాశక్తి - పాలకోడేరు
మండలంలోని కుముదవల్లి రైల్వే ట్రాక్‌పై హటియ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. భీమవరం రైల్వే స్టేషన్‌ నుంచి ఈ ట్రెయిన్‌ రాకపోకలకు సంబంధించి సమయానికి సిగల్స్‌ అందకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. సుమారు 20 నిమిషాల పాటు ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జార్ఖండ్‌ నుంచి బయలుదేరిన శ్రీఎం విశ్వేశ్వరయ్య టు బెంగళూరు వెళ్లే హటియ ఎక్స్‌ప్రెస్‌ కుముదవల్లి రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఎట్టకేలకు ట్రెయిన్‌ వెళ్లేందుకు సిగల్‌ రావడంతో యథావిధిగా కొనసాగింది. రైల్వే డబ్లింగ్‌ పనులు పూర్తయిన తర్వాత డబుల్‌ ట్రాక్‌ ఏర్పాటయ్యాక తరచూ ట్రెయిన్ల రాకపోకలకు సంబంధించి సిగల్‌ సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిసింది.