ప్రజాశక్తి - భీమడోలు
అంబరుపేట గ్రామపంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శి ఎఎస్‌విఎస్.కుమార్ అందించిన సేవలు అభినందనీయమని, ఇతరులకు ఆదర్శమని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారావు తెలిపారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఎవిఎస్‌వి.కుమార్‌కు జిల్లా సంఘం, మండల ప్రజా పరిషత్, స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో భీమడోలులో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సేవలను కొనియాడారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన కుమార్ 1998లో పోతునూరులో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి, 2004లో వట్లూరు, 2011లో శనివారపుపేటలో పనిచేసిన అనంతరం 2014లో రామసింగవరం, కూచింపూడి గ్రామపంచాయతీలో గ్రేడ్ -2 కార్యదర్శిగా ఉద్యోగోన్నతి పొందారు. 2017లో వసంతవాడ గ్రేడ్-1 కార్యదర్శిగా ఉద్యోగోన్నతి పొందారు. బదిలీపై 2020లో సూరప్పగూడెం కార్యదర్శిగా వచ్చారు. మండల పరిధిలోని ఆరు ఇతర గ్రామపంచాయతీలో కార్యదర్శిగా పనిచేశారన్నారు. 2022లో అంబరుపేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ ఉద్యోగ విరమణ తీసుకున్నారని తెలిపారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన కుమార్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకకరించిన తీరును సహచర గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు భీమడోలు ఎంపిడిఒ రాఘవన్, కె.రామయ్య, జెడ్‌పిటిసి సభ్యులు తుమ్మగుంట భవానీ రంగ, ఎఎంసి ఛైర్‌పర్సన్ ఇంజేటి నీలిమ జూనియర్, పలువురు సర్పంచులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భీమడోలు తహశీల్దార్ జాన్‌రాజు పాల్గొన్నారు.










