Jan 23,2022 12:49

పురుడు పోసేది ఓ కులం
పాడి కట్టేది ఓ కులం

గంజి బతుకులది ఓ కులం
బెంజి జీవితాలది ఓ కులం

పాలించే ప్రభువులది ఓ కులం
పల్లకి మోసే వారిది ఓ కులం

బయటకు పలికేది సమానత్వం
అంతరాలలో చెరగని కులతత్వం

తరాలు మారినా తీరు మారని
మనుషుల ఆలోచన చిత్రం
శాశ్వతమైన పంచభూతాలకు లేని కులం
శ్వాస ఆగిపోయే మనకెందుకు ఈ కులం..

ప్రశ్నించే కలమే మన కులమైతే
ఇక చరమ గీతమే కదా కులరక్కసికి..!

కంది సత్యనారాయణ మూర్తి
90302 77529