పరువుహత్యల ఉన్మాదాలు
నడిరోడ్డుపై రక్తపు మడుగులు
చోద్యం చూస్తున్న సకల జనులు
సాక్షుల్నే దోషులంటున్న అస్రీన్‌లు
మత-కులోన్మాద దారుణ దాష్టీకాలు!
కుల-మతాంతర వివాహాల హత్యలు
కులం కత్తి ఝళిపిస్తున్న విపరీతాలు
మతాంతరీకరణలు, కులన్యూనతలు
నిమ్నవర్గ యువతకే యమపాశాలు
కులమత నిర్మూలనలే పరిష్కారాలు !
మానవమృగాలు పేట్రేగుతున్న ఘోరాలు
తోబుట్టువులే గొంతుకోస్తున్న అకాలాలు
కులమత కుంపట్లలో బుగ్గిపాలవుతూ..
స్మశానాల పాలవుతున్న నాగరాజులు
మానవీయతనే హత్య చేస్తున్న కత్తులు!
మధుపాళీ
99497 00037