ప్రజాశక్తి - చీరాల
కులం, మతం పేరుతో జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్‌కుమార్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి కోరారు. ప్రజానాట్య మండలి బాపట్ల జిల్లా సమావేశం స్థానిక పద్మశాలి ఫంక్షన్ హాల్‌లో శనివారం జిల్లా నాయకులు పి కిరణ్ అధ్యక్షతన నిర్వహించారు. కులం, మతం పేరుతో ప్రజలపై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరినీ చైతన్య పరచడానికి కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అనే లక్ష్యంతో పని చేస్తున్న ప్రజానాట్య మండలిని బలోపేతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా కళాకారుల దళాలు తయారు చేసి ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళారూపాలను, కళలను బ్రతికించాల్సిన ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయని అన్నారు. ప్రజల్ని చైతన్య పరచడంలో కళాకారులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కన్వినర్‌గా బొనిగల సుబ్బారావు, కో-కన్వినర్ గా పి కిరణ్, సభ్యలుగా బి నాగరాజు, ఎం అయ్యప్పరెడ్డి, సత్యమూర్తి, బి దశరధ, ఎన్ సుందరం, దక్షిణామూర్తి, పోతురాజుతో కమిటీ ఎన్నుకున్నారు.










