Nov 21,2023 23:37

కూలిన కల్వర్టు


ప్రజాశక్తి-పొదిలి : పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కాటూరివారిపాలెం గ్రామంలో పొలాలకు వెళ్లే రహదారిలో ఉన్న కల్వర్టు మంగళవారం హఠాత్తుగా కూలి పోయింది. అదే సమయంలో కల్వర్టుపై ప్రయాణిస్తున్న ట్యాంకర్‌ బోల్తా పడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు పొలానికి ట్యాంకర్‌ ద్వారా నీటిని తీసుకువెళ్తున్నాడు. ట్యాంకర్‌ పోలేరమ్మ గుడి వద్ద ఉన్న చప్టాపైవెళ్లింది. అదే సమయంలో చప్టా కుంగిపోయింది. దీంతో టాక్టర్‌ బోల్తా కొట్టింది. సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కల్వర్టు పొలాలకు వెళ్లేందుకు అనువుగా ఉంది. ఈ చప్టాపై నిత్యం పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు, వ్యవసాయ కూలీలు ఆటోలు, ఇతర వాహనాలు, బైకులపై రాకపోకలు సాగిస్తుంటారు.