
ప్రజాశక్తి -కోటవురట్ల:ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలని జిల్లా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రోజా రమణి సూచించారు. బుధవారం ఆమె ఉపాధి భవనంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతిరోజు సగటున వేతనం రూ.272లు వచ్చే విధంగా పనులు చేయించడంతో పాటు, ప్రతి జాబు కార్డుదారులకు వంద రోజులు పని కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలలో సర్వే నిర్వహించి అర్హత కలిగిన వారందరికీ జాబ్ కార్డు అందజేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా పని ప్రదేశంలో వసతులు కల్పించాలని, ఉదయం సమయంలోనూ, సాయంత్రం సమయం లో పని చేసినట్లయితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అరుణశ్రీ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏపీవో గంగు నాయుడు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.