May 21,2023 00:36

కూలీలతో పనులు చేస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి పాయకరావుపేట:ఉపాధి హామీ కూలీలతో కలిసి మండుటెండలో శనివారం ఎమ్మెల్యే గొల్ల బాబురావు పని చేశారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తమకు టెంట్లు ఏర్పాటు చేయాలని, మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు.మంచినీళ్లు ఏర్పాటు చేసి, కూలీ పెంచాలని పేర్కొన్నారు. స్పందించిన గొల్ల బాబురావు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటే కొంతమంది ప్రతిపక్షాలు వారు విమర్శలు గుప్పిస్తున్నారని వారు ఎంత విమర్శలు చేస్తే జగన్మోహన్‌ రెడ్డికి అన్ని దీవెనలని మళ్లీ ఈ రాష్ట్రాన్ని ఏలేది జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వమేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.