గోడకూలిన ఘటనలో మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 12.25 లక్షలు
ప్రజాశక్తి - సామర్లకోట
పట్టణం బలుసుల పేటలో రెండు రోజుల క్రితం చర్చి నిర్మాణ పనుల్లో భాగంగా గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటనకు సంబం ధించి మతుల కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన కూలీ కుటుంబానికి పరిహారాన్ని శుక్రవారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.12.25 లక్షల చొప్పున మూడు కుటుంబాలకు చర్చి నిర్వాహకులు కాకినాడకు చెందిన పాస్టర్ విజరుకుమార్ నగదు రూపంలో సాయంత్రం కుటుంబాలకు అందజేశారు. చర్చి గోడ కూలిన ప్రమాదంలో పెట్టారు మచ్చ నాగేశ్వరరావు మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రమాదంలో మరో కూలీకి తీవ్ర గాయాల య్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు గత రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ వద్ద కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా శుక్రవారం కాకినాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో చర్చి యజమాని, జనసేన పెద్దా పురం నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల రామస్వామి (బాబు), ఇతర దళిత సంఘాల నాయకులు మధ్య చర్చలు సఫలమయ్యాయి. దానితో కుటుంబా లకు ఒక్కొక్కరికి రూ. 12.25 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు పాస్టర్ విజరు కుమార్ అంగీకరించారు. దీంతో నాయ కులు ఆందోళనను విరమించారు. అనంతరం సాయంత్రం సామర్లకోట లోని బలుసుల పేటలకు గల బాధిత కుటుంబాలకు పాస్టర్ విజరుకుమార్, మండల పాస్టర్ అసోసియేషన్ నాయకుల సమక్షంలో కుటుంబాలకు పరిహారాన్ని అందజేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో గత రెండు రోజులుగా ఎంతో కృషి చేసిన ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మల బాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు లకు, ఆయా పార్టీల నాయకులకు, కుల వివక్ష పోరాట సమితి నాయకులకు బాధిత కుటుంబాలు కతజ్ఞతలు తెలిపారు. కాగా బాధ్యత కుటుంబాల పక్షంగా పోరాడిన వారిలో 13 వ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు, కెవిపిఎస్ జిల్లా నాయకులు పిట్టా వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, అందుగుల జార్జి చక్రవర్తి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, జనసేన నాయకులు సరోజ వాసు, మంచెం సాయిబాబు, పిట్టా జానకి రామారావు తదితరులకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. పరిహార సొమ్ముతో బాధిత కుటుంబాలు వారి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలని జనసేన ఇన్చార్జి తుమ్మల బాబు, మండల పాస్టర్ అసోసియేషన్ నాయకులు జే జయరాజు తదితరులు కుటుంబాలకు సూచించారు.










