Jan 03,2021 13:20

నేను ఒక రైతు బిడ్డని
అమ్మ కడుపునే పుట్టితిని
అల్లారుముద్దుగా ఎదిగితిని
పట్టెడన్నం కోసం నాగలి పట్టితిని...

కాయకష్టం చేసి బతుకు పోరులో
నలిగితిని
రేయి పగలు తేడా మరిచి సాగితిని
అన్నదాత అంటే మురిసితిని
నేలను నమ్ముకొని బతికితిని....

వానలు కురవాలంటు కోరితిని
మా పంటకు గిట్టుబాటు ధర
అడిగితిని
అడిగి అడిగి అలసి సొలసితిని
నష్టాలను పూర్చలేక చితికిపోతిని....

అప్పుల బాధలు తాళలేక
వ్యవసాయాన్ని వీడితిని
ఇలా రోజు కూలిగా మారిపోతిని
పదిమందికి అన్నం పెట్టే నేను
పట్టెడన్నం కోసం పరుగులు పెడుతూ
కూలీగా మార్చబడ్డ రైతు బిడ్డని...!!

- జ్యోతి మువ్వల
jmuvvala83@gmail.com