నాగళ్లతో
దుక్కి దున్ని
చదును చేసి
నీరు పెట్టి
నారు మడిగా మార్చి
విత్తనాలు చల్లి
ఆకుతీత తీసి
నాట్లు వేసి
కలుపు తీసి
వరి కోసి
కుప్ప వేసి
చదును చేసి
గడ్డని వరిగింజల్ని
వేర్వేరుగా చేసి
ధాన్యాన్ని బస్తాలో వేసి
భద్రంగా రైతు కప్పగించి
నాలుగు గింజలు దక్కని
ఖాళీ కడుపుతో
నిరంతరం కష్టపడి
కాలాన్ని నిద్ర పట్టనివ్వని
కనికరించే కష్టజీవిని
మీ కూలోణ్ణి
కూలీ
చులకన కాదు
మీ అవసరాన్ని
దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
94930 33534