ర్యాలీ నిర్వహిస్తున్న ముఠా కార్మికులు
ప్రజాశక్తి- వేపగుంట : ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం గోపాలపట్నంలో ర్యాలీ నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు వి వెంకటరావు మాట్లాడుతూ ఫుడ్ గైడ్స్ ఏషియన్, ముఠా వర్కర్స్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పంద కాలం ముగిసినప్పటికీ, నూతన ఒప్పందం చేసుకునేందుకు యాజమాన్యం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కుటుంబాలతో చాలీచాలని కూలితో కూలీల జీవనం దుర్భరంగా సాగుతోందని, ఈ నేపథ్యంలో నూతన ఒప్పందం చేసుకుని, ముఠా కార్మికులకు కూలి రేట్లనుపెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఠా కార్మికులు పైడపునాయుడు, పైడన్న, నగేష్ పాల్గొన్నారు










