Jun 07,2023 00:23
బ్యాంక్‌ మేనేజర్‌కు వినతిపత్రం అందిస్తున్న కృష్ణమోహన్‌

ప్రజాశక్తి-కర్లపాలెం: కర్లపాలెం ఉపాధి హామీ పథకం కింద మండుటెండలో పనిచేసిన కూలీల డబ్బులు కర్లపాలెం యూనియన్‌ బ్యాంక్‌లో పడగా ఆ డబ్బులను మేనేజర్‌ ఇవ్వకపోవడం దారుణమని, వెంటనే ఆ డబ్బులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్‌ అన్నారు. మంగళవారం కర్లపాలెం యూనియన్‌ బ్యాంకులో పడిన ఉపాధి కూలి డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరుతూ యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పి భగత్‌కు పేరలపాడు గ్రామస్తులతో కలిసి వినతిపత్రం అందించారు. యూనియన్‌ బ్యాంకు వాళ్లు వెంటనే మానవతా దక్పథంతో ఇవ్వాలని లేని పక్షంలో ఉపాధి కూలీలతో కలిసి బ్యాంకు వద్ద ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పేరలపాడు గ్రామ ఉపసర్పంచ్‌ కె నాగరాజు మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.