Oct 12,2023 23:29

కుడిపూడిని సత్కరిస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధులు

ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి జన్మదిన వేడుకల్లో మంత్రి వేణు
ప్రజాశక్తి - తాళ్లరేవు
కులగణనతో బిసిలకు రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత రానుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘంఆధ్వర్యంలో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిపూడి శివన్నారాయణ పుట్టిన రోజును నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సత్కారసభలో మంత్రి వేణు పాల్గొని మాట్లాడారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి వైఎస్‌ఆర్‌ కుటుంబం రాజకీయ ప్రాధాన్యతనిచ్చిందన్నారు. దాన్ని సిఎం జగన్‌ కొనసాగిస్తున్నారన్నారు. ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌ కుడుపూడి సేవా నిరతిని కొనియాడారు. తొలుత శివన్నారాయణ అభిమా నులు వంద మంది రక్తదానం చేశారు. కాలా సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కుడుపూడి శివన్నారాయణ, నాగమణి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తాను ఎప్పుడూ ముందుంటాన న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాయుడు సునీత, జడ్‌పిటిసి సభ్యులు దొమ్మేటి శామ్యూల్‌సాగర్‌, కుడిపూడి శంకర్రావు, సంసాని నాగేశ్వరరావు, జి.మల్లేశ్వరరావు, ఎం.లోవరాజు, కొప్పిశెట్టి వెంకట్‌, కాలా వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.