Nov 18,2023 20:57

సదస్సులో మాట్లాడుతున్న జెసి గణేష్‌

కడప ; రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ జి.గణేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌ లోని స్పందన హాలులో శనివారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కులగణన- 2023 జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనను విజయవంతం చేయాలన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివద్ధి కార్యక్రమాల లబ్ది అర్హులైన వారందరికీ చేరాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. కుల దవీకరణ పత్రాలు లేక, అర్హత ఉన్నా కొందరు సంక్షేమ, అభివద్ధి ఫలాలు పొందలేకపోతున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఈ సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేపడుతోందన్నారు. సామాజిక, ఆర్థిక స్థితి, వారి కులవత్తి, వారి విద్యా అర్హత తెలుసుకుని ప్రభుత్వ పథకాలు ఎంతవరకు ఉపయోగిం చుకోగలు గుతున్నారు, సమాజంలో అన్నికులలకు సమానత్వం తీసుకురావాల్సి ఉండడం లాంటి అంశాలను దష్టిలో ఉంచుకుని కులగణన చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ నెల 27 నుంచి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి కులగణన చేస్తారన్నారు. కులగణనపై అధికారులు, సచివాలయ సిబ్బంది విస్తత ప్రచారం చేయాలన్నారు. సమసమాజ పునరుద్ధరణకు చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాలుపంచుకుని, సర్వే అధికారులు, సిబ్బందికి సహకరించాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ గంగాధర్‌గౌడ్‌, పిఆర్‌అండ్‌ ఆర్‌డి సలహాదారు నాగార్జునరెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష, కడప, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీవోలు మధుసూధర్‌, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీపీవో వెంకట్రావు, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి సరస్వతి, డిటిడబ్ల్యుఓ, ఎస్సి కార్పొరేషన్‌ ఈడి డా. హెచ్‌. వెంకట సుబ్బయ్య, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి, మైనార్టీ కార్పొరేషన్‌ ఈడి డా. వి.బ్రహ్మయ్య, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ షేక్‌ ఇమ్రాన్‌, వివిధ కులాల కార్పొరేషన్‌ డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.