మాట్లాడుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ మంజుల
ప్రజాశక్తి -భీమునిపట్నం : కుల, మత రహిత సమాజ స్థాపనకు బాబూ జగ్జీవన్‌రామ్ విశేష కృషి చేసారని స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ మంజుల తెలిపారు. కళాశాలలో మంగళవారం జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహనీయుల చరిత్రలు తెలుసుకోవడం ద్వారా విద్య పట్ల ఆసక్తి, దేశభక్తి, సమాజ సేవ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎం.రమణ, డాక్టర్ ఎ.ప్రసాద్, వై.శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.










