Nov 21,2023 21:07

భోగాపురం: మాట్లాడుతున్న తహశీల్దార్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి - భోగాపురం : ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని విజయనగరం తహశీల్దారు కోరాడ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో మంగళవారం పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని కార్యదర్శులు, విఆర్‌ఒలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు సహాయంతో ఈ సర్వేను పక్కాగా చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన సూచనలు మేరకు వారి నుంచి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఏవిధంగా చేయాలో వారికి శిక్షణ ఇచ్చారు. ఎంపిడిఒ నీలం అప్పలనాయుడు ప్రస్తుతం వాలంటీర్లు వద్దనున్న సెల్‌ఫోన్లు, డివైజర్లు సక్రమంగా పనిచేయడం లేదని దీని వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడే అవకాశం ఉందని కొంతమంది కార్యదర్శులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ తహశీల్దారు ఇమంది భాస్కరరావు, ఇఒపిఆర్‌డి సురేష్‌ పాల్గొన్నారు. నెల్లిమర్ల: కుల గణన పక్కాగా నిర్వహించాలని తహశీల్దార్‌ డి. ధర్మ రాజు, ఎంపిడిఒ జి.రామారావు సూచించారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాల యంలో కులగణనపై పంచాయతి కార్యదర్శులు, సచివాయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 16 సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి కుల గణన పక్కాగా చేయాలని సూచించారు. ప్రతీ ఇంటిలో ఏఏ కులాల వారు ఉన్నారో పరిశీలించి నమోదు చేయాలన్నారు. వారికి కులాల వారిగా అందుతున్న పథకాలు వివరాలు గుర్తించి పక్కగా కుల గణన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇఒపిఆర్‌డి కె.సింహాద్రి, పలువురు పంచాయతి కార్యదర్శులు, సచివాల య సిబ్బంది పాల్గొన్నారు. బొబ్బిలిరూరల్‌ : ప్రతి ఇంటికీ వెళ్లి కుల గణన నిర్వహించాలని జిల్లా బి.సి వెల్ఫేర్‌ అధికారి బి.రామానందం, తహశీల్ధార్‌ డి.రాజేశ్వరరావు, ఎంపిడిఒ రవి కుమార్‌లు అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో కార్యదర్శిలు, విఆర్‌ఒలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో కులం, ఉపకులం, వృత్తి, ఇంటి పెద్ద, చదువు, తదితర వివరాలు సేకరించాలన్నారు. ఈ సర్వే వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులూ లేవని తెలియజేస్తూ ప్రజల భాగస్వామ్యంతో సర్వే నిర్వహించాలని సూచించారు. మెరకముడిదాం: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం కులగణనకు సంబంధించి తెర్లాం ఎంపిడిఒ ఎస్‌ రామకృష్ణ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపిడిఒ రామకృష్ణ మాట్లాడుతూ నవంబర్‌ 20,21,22 తేదీలలో వివిధ మండలాల్లో శిక్షణలు నిర్వహించి మొట్టమొదటిగా 27 నవంబర్‌ నుండి అన్ని గ్రామాలలోను ప్రభుత్వ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కులగణన సర్వే చేపడతారని చెప్పారు. సచివాల యాల ఉద్యోగులు ఆయా సచివాలయాల పరిధిలో ఇంటిం టికి వెళ్లి వివరాలు సేకరించి ఖచ్చితమైన సమాచారం అధికారులకు నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెర్లాం తహశీల్దార్‌ రత్నకుమార్‌, మెరకముడిదాం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.