
కుల గణ చేస్తామని కాంగ్రెస్ సిడబ్ల్యూసి తీర్మానం పట్ల హర్షం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
దేశంలో బీసీల కు మద్దతుగా నిలబడి, దేశ వ్యాపితంగా బిసి కులగణన చేస్తామని చెప్పి సిడబ్ల్యూసిలో తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జె. లక్ష్మి నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నంద్యాల లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జె. లక్ష్మి నరసింహ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి బిసి ల మీద ప్రేమ ఉంటే వెంటనే మన రాష్ట్రములో కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉన్న బీసీలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయంతీసుకుందని బలహీన వర్గాల సామాజిక న్యాయ ప్రస్థానంలో కాంగ్రెస్ మరో ముందడుగు వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీఅధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వెంటనే కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిని అడగడం వెంటనే ఆయన CWC తీర్మానం చేయించడం పట్ల హర్షం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే 3 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారని,బీజేపి 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కేవలం ఒక బీసీ ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నారని తెలిపారు. దేశంలో బీసీలు ఎస్సీ ,ఎస్టీ,ల జనాభా తెలిస్తేనే వారి అభివృద్దికి,విద్య,వైద్యం,ఆర్థిక, న్యాయానికి కృషి చేయడానికి మార్గాలు మరింత సుగమం అవుతుందని విద్య,ఉద్యోగ,ఆర్థిక,రాజకీయ సమానత్వం రావాలనే కుల గణన చేపట్టాలి,మొన్న జరిగిన పార్లమెంట్ లో మహిళ బిల్లు లో కూడా బిసి,ఎస్సి,ఎస్టీ మైనారిటీలకు కూడా సబ్ కోట రిజర్వేషన్ లు. కల్పించాలని కేవలం మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు,మరియు సమాజ్ వాదీ పార్టీ,డియంకె,ఆర్జేడీ,పార్టీలు మాత్రమే సబ్ కోటా రిజర్వేషన్లు కావాలని అడిగారని కానీ మన రాష్ట్రములో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ, టీడీపీ ఎంపీ లు కానీ అడగలేదని ,దేశములో 60%బిసి జనాభా ఉన్నప్పటికి విద్య,ఉద్యోగ,రాజకీయాలలో కేవలం 15% లోపలనే ఉన్నారని,బిసి ల మీద ప్రేమ ఉంటే వెంటనే మన ఆంద్రప్రదేశ్ లో బిసి కులగణన చేపట్టాలని వారి డిమాండ్ చేశారు.కావున బిసి,ఎస్సి,ఎస్టీ,మైనారిటీ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి కాంగ్రెస్ వైపు రావాలని పిలుపునిచ్చారు,కనీసం ఇప్పటికైనా రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేసుకుంటేనే మరొకసారి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంద ని బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అన్ని రంగాల్లో సామాజిక న్యాయం జరగాలంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యంఅని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అద్యక్షులు దాసరి చింతలయ్య,డిసిసి ప్రధానకార్యదర్శి డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి,మైనారిటీ సెల్ జిల్లా అద్యక్షలు పఠాన్ ,పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతలమోహన్ రావు,రాష్ట్ర స్పోకెన్ పర్సన్ ఉకొట్టు వాసు,ఎస్సి సెల్ జిల్లా అద్యక్షలు నాగలింగం, పాణ్యం కో ఆర్డినేషన్ సభ్యులు సాంబశివుడు, స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ యెస్.లక్ష్మన్న,డోన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.శేఖర్,బాలకృష్ణ,షేక్షా వలి,తదితరులు పాల్గొన్నారు.