Jan 27,2023 23:52

అధికారులతో మాట్లాడుతున్న ఆర్‌డిఒ జయరాం

ప్రజాశక్తి-నక్కపల్లి:జగనన్న చేదోడు సహా అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయవద్దని ఆర్డీవో జయరాం ఆదేశించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రెవిన్యూ సమస్యలపై చర్చించారు. మండలంలో 22ఏ రికార్డులో నమోదైన భూములకు సంబంధించి సమగ్ర వివరాలను సిద్ధం చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. వీటిపై ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్‌ సమీక్షించే అవకాశం వుందన్నారు. జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒకటి, రెండు గ్రామాల్లో సమస్యలు ఉన్నందున లబ్దిదారులు గృహాలు కట్టుకోవడానికి ముందుకు రాలేదని ఎంపీడీవో సీతారామరాజు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ సుబ్రహ్మణ్యశాస్త్రి, డీటీ నీరజ, ఈవోఆర్డి వెంకట నారాయణ వైస్‌ ఎంపీపీ నానాజీ, ఆర్‌ఎస్‌ఐలు ప్రసాద్‌, నర్సింగరావు, పాల్గొన్నారు .