మాట్లాడుతున్న నాయకులు
మాట్లాడుతున్న నాయకులు
కుల చిచ్చు పెట్టొద్దు
ప్రజాశక్తి-కావలి:ప్రశాంతంగా ఉన్న కావలి నియోజకవర్గంలో కాపు కులంలో చిచ్చు రేపి, రెండు కులాల మధ్య తగాదాలు పెట్టవద్దని, కావలి ఎం ఎల్ ఏ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై అవాకులు, చవాకులు పేలితే మలిశెట్టి వెంకటేశ్వర్లుకు తగిన బుద్ది చెప్పాల్సి వస్తుందని వైసిపికి చెందిన కాపునేతలు హెచ్చరించారు. గురువారం స్థానిక వై సి పి కార్యాలయంలో వైసీపీ కి చెందిన కాపు నేతలు సాయి కుమార్, దామిశెట్టి సుధీర్ నాయుడు,తూపిరిపెంచలయ్య, బండారు మహేష్ నాయుడు, మండలి కష్ణారావు, పోలిశెట్టి శ్రీనివాసులువిలేకరుల సమావేశంలో మాట్లాడారు.టీడీపీలో బలిజలకు పదవులిచ్చారని, వైసీపీలో ఇవ్వలేదనడం సరికాదన్నారు. ఎంఎల్‌ఎపై బురద చల్లాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.










