ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలో వీధి కుక్కలు ప్రజలను బెంబేలిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల వెంట ఆడుకునే పిల్లలను వెంబడించి మరీ కరుస్తున్నాయి. కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. రాత్రి సమయంలో పట్టణంలోని పలు కాలనీలు ముగతిపేట, హెచ్‌బిఎస్ కాలనీ, సంజీవ్ నగర్ కాలనీ, గీతానగర్, ఎన్‌టిఆర్ కాలనీ, వీవర్స్ కాలనీ, లక్ష్మీపేట, ఎంబి చర్చి, అటకారి వీధి, మైనారిటీ కాలనీ, శివ సర్కిల్ తదితర అన్ని ప్రధాన వీధుల్లో కుక్కల సంచారం ఎక్కువైంది. రాత్రి సమయంలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే వారిని బైక్ వెనుక వెంబడించి మరీ కరుస్తున్నాయి. కొన్ని నెలలుగా వీటి బెడద ఎక్కువైంది. వాటి బెడద లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో కుక్కల దాడిలో గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. కుక్కల నివారణకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వీధుల్లో కుక్కల సంచారం










