Jul 18,2023 09:51

కమిషనర్‌తో కలిసి రహమత్‌పురం సర్కిల్‌ను పరిశీలన చేస్తున్న దీపిక

          హిందూపురం : పట్టణంలోని రహమత్‌పురం సర్కిల్‌ను అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు రైల్వే రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామని వైసిపి సమన్వయ కర్త దీపిక అన్నారు. సోమవారం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డి, కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌తో కలిసి సర్కిల్‌తో పాటు రోడ్డును పరిశీలన చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పనులు ప్రారంభం కాక పోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో బైపాస్‌ రోడ్డులో ఉన్నా రహమత్‌పురం సర్కిల్‌ను అన్ని విదాలా తీర్చిదిద్దడంతో పాటు పైలాన్‌ పని చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే రోడ్డు విషయంలో అధికారులు, మంత్రులతో చర్చించి, అవసరమైప నిధులను మంజూరు చేయించి, త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే మురుగు కాలువల పనులను, విద్యుత్‌ స్తంబాలను మార్చే పనులను ప్రారంభించామని, త్వరలో రోడ్డు పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజినీయర్లు, కౌన్సిలర్లు మారుతిరెడ్డి, శివ, రామచంద్ర, వైసిపి రాష్ట్ర కార్యదర్శి హనుమంత రెడ్డి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.